హిందుత్వ మరియు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) కి సంక్షిప్త పరిచయం
RSS 1925లో స్థాపించబడిన అతివాద సంస్థ. హిందుత్వ అనేది RSS యొక్క నకిలీ జాతీయవాదంపై ఆధారపడిన రాజకీయ సిద్ధాంతం. దీని లక్ష్యం భారతదేశంలో హిందూ ఆధిపత్యాన్ని స్థాపించడం లాగా కనిపిస్తుంది, అయితే దాని అసలు లక్ష్యం బ్రాహ్మణ ఆధిపత్యాన్ని కొనసాగించడం.
RSS దాని రాజకీయ విభాగం అయిన భారతీయ జనతా పార్టీతో (BJP) సహా అనేక సంస్థలు దీనిలో భాగం. ఇది భారతదేశంలో నాలుగుసార్లు నిషేధించబడింది, కానీ ఇది ఇప్పుడు చురుకుగా ఉంది. RSS యొక్క పూర్వ సభ్యుడు అయిన నాథూరామ్ గాడ్సే 1948 లో మహాత్మా గాంధీని హత్య చేసినప్పుడు ఇది రెండోసారి నిషేధించబడింది.
గమనిక: 90% భారతీయుల పట్ల వివక్ష చూపుతున్న సనాతన ధర్మం, వర్ణ వ్యవస్థ లేదా కుల వ్యవస్థను బహిర్గతం చేసే బ్లాగ్ పోస్ట్ సిరీస్‌లో ఇది మూడవ పోస్టు. ఇది భారతదేశంలోని అనేక సామాజిక-ఆర్థిక సమస్యలకు మూలకారణం. సనాతన ధర్మాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవడానికి మొదటి పోస్ట్‌లో పేర్కొన్న మిగిలిన పోస్ట్‌లను చదవమని నేను సూచిస్తున్నాను.
సనాతన ధర్మాన్ని ప్రస్తావించకుండా హిందుత్వ RSS గురించి చర్చించడం అసంపూర్ణం
నేను మిగతా వ్యాసాలలో చెప్పినట్టు, బ్రాహ్మణవాదం లేదా సనాతన ధర్మం మొదట వైదిక బ్రాహ్మణ మతం గా చలామణి అయ్యింది. తర్వాత బ్రాహ్మణీకరించబడిన హిందూమతం మరియు హిందుత్వ ముసుగులో చలామణి అవుతుంది. తేడా ఏంటంటే బ్రాహ్మణవాదులు తమ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి వర్ణ లేదా కుల వ్యవస్థను ఒక వ్యూహాత్మక సాధనంగా వైదిక బ్రాహ్మణ మరియు హిందూమతాలలో ఎంచుకున్నారు. కానీ వారు మతాన్ని హిందూత్వ రాజకీయ భావజాలంలో ఎంచుకున్నారు.
ముస్లింల మరియు బ్రిటీషర్ల పాలన తర్వాత చాలామంది హిందువులు ముస్లిం మరియు క్రైస్తవ మతాలలోకి మారారు. ఒక పక్క నకిలీ ‘హిందూ జాతీయవాదం’ పేరిట ముస్లిములు మరియు క్రైస్తవులపై ద్వేషాన్ని పెంచడం ద్వారా వెనుకబడిన కులాల లోని హిందువుల ఓట్లను ఏకీకృతం RSS చేయడం. ఇంకోపక్క బ్రాహ్మణవాద కులవ్యవస్థను బలోపేతం చేయడం RSS వ్యూహం. అంతే తప్ప RSS హిందువుల కోసం పనిచేస్తుంది అన్నది పెద్ద అబద్ధం. RSS కు కావలసింది హిందూ ఓట్లు మాత్రమే. RSS అంతర్గతంగా వర్ణ వ్యవస్థను సమర్థిస్తుంది. దీని గురించి కొన్ని ఉదాహరణలు నేను కింద చెప్పాను.
డా.బి.ఆర్. అంబేద్కర్ తన పుస్తకం ‘పాకిస్తాన్ ఆర్ ది పార్టిషన్ ఆఫ్ ఇండియా’ ఇలా అన్నారు1
హిందూ రాజ్ (హిందూ రాష్ట్రం) వాస్తవంగా మారితే, అది ఈ దేశానికి అతిపెద్ద విపత్తు అవుతుంది. హిందువులు ఏమి చెప్పినా, హిందూమతం అనేది స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వానికి పెనుముప్పు. ఈ విషయంలో అది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. హిందూ రాజ్యాన్ని లేదా హిందుత్వ వాదాన్ని ఎలాగైనా నిరోధించాలి.
బాబాసాహెబ్ అంబేద్కర్, తన పుస్తకం Partition of India లో Tweet
హాస్యాస్పదం ఏంటంటే అంబేడ్కర్ RSS సిద్ధాంతాలను మెచ్చుకున్నాడు అని RSS బ్రాహ్మణవాదులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
అంబేద్కర్ హిందూ మతం మరియు హిందువుల గురించి ప్రస్తావించినప్పుడు, ఆయన బ్రాహ్మణీకరించబడిన హిందూ మతం మరియు బ్రాహ్మణవాద హిందువులను గురుంచి చెప్పారు అని మనం అర్ధం చేసుకోవాలి. వీరిలో వివక్ష మరియు దోపిడీ వర్ణ వ్యవస్థకు మద్దతు ఇచ్చే బ్రాహ్మణేతర ఉన్నత కులాలు వారు కూడా ఉన్నారు.
కొన్ని వాస్తవాలతో RSS లో అంతర్భాగమైన వర్ణ మరియు కులతత్వ స్వభావాన్ని అర్థం చేసుకుందాం.
RSS కీలక నాయకుల స్వాభావిక కులవాదం బహిర్గతం
ఇంటిగ్రల్ హ్యూమనిజం అనే తన పుస్తకంలో, BJS రాజకీయ పార్టీ స్థాపకుడు దీనదయాళ్ ఉపాధ్యాయ ఇలా అన్నాడు2
మన భావన ప్రకారం నాలుగు కులాలు విరాట్-పురుషుని యొక్క వివిధ అవయవాలకు సారూప్యంగా భావించబడుతున్నాయి. విరాట్-పురుషుని తల నుండి బ్రాహ్మణులు, అతని చేతుల నుండి క్షత్రియులు, అతని ఉదరం నుండి వైశ్యులు మరియు అతని కాళ్ళ నుండి శూద్రులు సృష్టించబడ్డారు అని చెప్పబడింది. ఈ భావనను విశ్లేషిస్తే, ఏదైనా సంఘర్షణ తలెత్తుతుందా అనే ప్రశ్న మనకు ఎదురవుతుంది. అదే విరాట్-పురుషుని తల, చేతులు, కడుపు మరియు కాళ్ల మధ్య సంఘర్షణ మొదలైతే, శరీరాన్నికలిగివుండలేము. ఈ ఆలోచనే కుల వ్యవస్థకు మూలం. ఈ ఆలోచనను, అంటే వర్ణ వ్యవస్థను సజీవంగా ఉంచకపోతే, ఒకదానికి ఒకటి పరిపూర్ణంగా ఉండే కులాల మధ్య సంఘర్షణలు తలెత్తవచ్చు.
తన పుస్తకం 'Integral Humanism' లో దీనదయాళ్ ఉపాధ్యాయ, BJS (ఇప్పుడు BJP) వ్యవస్థాపకుడు Tweet
We or Our Nationhood Defined అనే తన పుస్తకంలో, RSS యొక్క రెండవ సర్సంఘచాలక్, అంటే RSS అధిపతి, M. S. గోల్వాల్కర్ ఇలా అన్నాడు3
హిందూ సామాజిక వ్యవస్థ లో (వర్ణ/కుల వ్యవస్థ) ఉన్న ప్రతికూలతలు ఏవీ మన ప్రాచీన వైభవాన్ని తిరిగి పొందకుండా నిరోధించలేవు.
తన పుస్తకం 'We or Our Nationhood Defined' లో M. S. గోల్వాల్కర్, RSS రెండవ సర్సంఘచాలక్ (అధిపతి) Tweet
ఇలా కూడా చెప్పారు: “ఈ వాస్తవమే ప్రపంచంలోని మొదటి మరియు గొప్ప చట్టకర్త అయిన మను ని తన చట్టాలు అమలుపరిచేలా చేసి, ప్రపంచంలోని ప్రజలందరూ హిందుస్థాన్‌కు వచ్చి అందరి కంటే ముందు పుట్టిన బ్రాహ్మణుల పవిత్ర పాదాల వద్ద తమ విధులను నేర్చుకోవాలని నిర్దేశించింది.“
హిందుత్వ భావజాల రూపకర్త అయిన సావర్కర్, హిందుత్వ భావజాలానికి హిందువులందరిని ఆకర్షించడానికి కులాంతర వివాహాలు మరియు భోజనాలు చేయాలని సూచించారు.కానీ, ఆచరణలో ఆ దిశగా చిత్తశుద్ధి తో పనిచేయలేదు. కానీ హిందువుల మధ్య అసమానతలకు మూలకారణమైన బ్రాహ్మణీయ గ్రంథాలను ప్రశ్నించే నిబద్దత ఆయనలో లేదు. అతను వర్ణ వ్యవస్థకు మద్దతుగా తన పుస్తకంలో అస్పష్టమైన వివరణలు ఇచ్చాడు.
తన పుస్తకం Essentials of Hindutva లో, సావర్కర్ ఇలా అన్నాడు4
ఒక వ్యక్తి తన స్వంత చర్యల ద్వారా కొన్నిసార్లు తన మొదటి కులాన్ని కోల్పోవచ్చు మరియు మరొక కులానికి మారవచ్చు. శూద్రుడు బ్రాహ్మణుడు కావచ్చు మరియు బ్రాహ్మణుడు శూద్రుడు కావచ్చు.
తన పుస్తకం 'Essentials of Hindutva' లో సావర్కర్ Tweet
ఇది అర్ధం లేని వ్యాఖ్య. ఎందుకంటే మన కులం మన పుట్టుకతో నిర్ణయించబడుతుంది మరియు మన వేరే కులం లోకి మారలేము అని మనందరికీ తెలుసు.
అలాగే ఆయన ఇలా చెప్పారు, “ప్రాచీన కాలంలో కూడా మన నాలుగు ప్రధాన కులాలు స్థానిక పరిపాలనా సంస్థలలో కుల ప్రాతిపదికన ప్రత్యేక ప్రాతినిధ్యాన్ని పొందాయి.”
ఇది చాలా అవాస్తవ ప్రకటన. ప్రాచీన కాలంలో విద్యను అభ్యసించడానికి మరియు ఆస్తిని కూడగట్టుకోవడానికి కూడా అనుమతించబడని, మరియు అగ్రశ్రేణి వర్ణాల దాస్యం నుంచి తప్పించుకోలేని శూద్రులు ఎలా ప్రత్యేక ప్రాతినిధ్యాన్ని పొందారు? అతని పుస్తకం అటువంటి అస్పష్టమైన మరియు అసత్య ప్రస్తావనలతో నిండి ఉంది.
బ్రాహ్మణీయ ఆధిపత్యాన్ని విశ్వసించే దీనదయాళ్, గోల్వాల్కర్, సావర్కర్ వంటి వారు 90% భారతీయుల పట్ల వివక్ష చూపే వర్ణ వ్యవస్థను, మనుస్మృతిని మెచ్చుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఇప్పుడు బీజేపీ నేతలు మనుస్మృతిని కొనియాడుతున్నారు, న్యాయమూర్తులు తీర్పులు ఇవ్వడానికి మనుస్మృతి ని సూచిస్తున్నారు.
అందరిని కలుపుకుపోయేట్టు బయటికి కనబడే RSS మరియు దాని అంతర్గత కులవాద విధానాలు
RSS సభ్యులందరూ ఒకే యూనిఫారం ధరించడం వల్ల RSS బయటికి హిందువులందరినీ సామాజికంగా కలుపుకొనే లాగా కనబడుతుంది. OBC, SC మరియు ST కులాల హిందువులు RSS సభ్యుల సింప్లీసిటీ, క్రమశిక్ష, సామజిక సేవ చూసి RSS కు ఆకర్షితులవుతారు.
తాము దేశానికి ఎంతో సేవ చేస్తున్నామన్న భావనలో ఉంటారు. కానీ RSS వారిని కేవలం ముస్లింల, క్రైస్తువుల పై ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి మరియు దాడి చేయడానికి మాత్రమే ఉపయోగించుకుంటుంది. ఎందుకంటే ముస్లింలు మరియు క్రైస్తవులు తమ భావజాలానికి, అంటే బ్రాహ్మణవాదానికి లేదా కులతత్వానికి ముప్పు అని RSS భావిస్తుంది. ఇస్లాం మరియు క్రైస్తవ మతంలోకి మారిన భారతీయులు హిందూ మతంలో ఉన్న అమానవీయ కుల వివక్ష నుంచి కొంత వరకు తప్పించుకున్నారు. కానీ క్రైస్తవం మరియు ఇస్లాంలో కూడా కుల వివక్ష ఇప్పటికీ ఉంది.
RSS ఎల్లప్పుడూ మత మార్పిడులకు వ్యతిరేకం మరియు బ్రాహ్మణ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి మరియు హిందూ ఓట్లను బీజేపీ కి మద్దతుగా కేంద్రీకృతం చేయడానికి వెనుకబడిన వర్గాలకు చెందిన హిందువులను హిందూమతంలోనే ఉంచడానికి ప్రయత్నిస్తుంది.
హిందుత్వ నకిలీ జాతీయవాదాన్ని మరియు కులవాద మరియు మతవాద RSS నాయకులను మాజీ RSS సభ్యులు బహిర్గతం
మతవాద RSS
RSS మతతత్వ స్వభావం అందరికీ తెలిసిందే. అయితే, ఈ పోస్ట్‌లో, హిందుత్వ మరియు RSS యొక్క నిజ స్వరూపాన్ని అర్థం చేసుకుని RSS నుండి వైదొలిగిన RSS సభ్యుల యొక్క కొన్ని అనుభవాలను మాత్రమే నేను చర్చించాను.
టీ10 న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్ విజయ్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ
RSS బ్రాహ్మణుల కుట్ర.. మత తీవ్రవాదులను సృష్టించే యూనివర్సిటీ. ఇది మొదట సభ్యులకు వ్యక్తిత్వ వికాసంలో శిక్షణ ఇస్తుందని, 2 సంవత్సరాల తరువాత, ఇది ముస్లింలు మరియు క్రైస్తవుల పట్ల ద్వేషాన్ని బోధించడం ప్రారంభిస్తుందని ఆయన వివరించారు. హిందూ రాష్ట్ర సాధన కోసం అవసరమైతే ముస్లింలు మరియు క్రైస్తవులను చంపడానికి మరియు సభ్యులు ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలని దాని సభ్యుల నుండి ప్రతిజ్ఞ తీసుకుంటుంది
మాజీ RSS ప్రచారక్ విజయ్ శంకర్ రెడ్డి Tweet
మీరు పూర్తి ఇంటర్వ్యూని క్రింద వీడియోలో చూడవచ్చు
RSS అధినేత మోహన్ భగత్ బహిర్గతం
RSS 6వ సర్సంఘచాలక్ (అధినేత) మోహన్ భగత్‌ను శంకర్ రెడ్డి బహిర్గతం చేశారు
నేను రెండు రాష్ట్రాల్లోని ప్రతి RSS మండలానికి వెళ్లి, వేలాది మంది ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలతో కలిసి అయోధ్యలో రామమందిరాన్ని నిర్మిస్తానని ప్రతిజ్ఞ చేసాను. మోహన్ భగత్ ఎన్నికల తర్వాత చెప్పిన దానిని విన్నాక షాక్ అయ్యాను. అతను ఒకసారి నాతో వ్యక్తిగతంగా ఇలా చెప్పాడు, “ రామమందిరాన్ని నిర్మిస్తే, మనము హిందువులు మరియు ముస్లింల మధ్య మతపరమైన అల్లర్లు సృష్టించలేము మరియు ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులను రెచ్చగొట్టలేము.
మాజీ RSS ప్రచారక్ విజయ్ శంకర్ రెడ్డి Tweet
మీరు పూర్తి ఇంటర్వ్యూని (ఆంగ్లం లో) క్రింద వీడియోలో చూడవచ్చు.
మీరు ఇంకొక ఇంటర్వ్యూని (తెలుగులో) క్రింద వీడియో లో చూడవచ్చు.
బ్రాహ్మణ వాదులచే శూద్ర మరియు అతి శూద్ర RSS సభ్యుల దోపిడీ
భన్వర్ మేఘవంశీ అంటరానితనాన్ని ఎదుర్కొని, RSS యొక్క నిజమైన కులతత్వ మరియు మతతత్వ స్వభావాన్ని తెలుసుకున్న తర్వాత RSS నుండి వైదొలిగిన మాజీ RSS విస్తారక్ (జూనియర్ ప్రచారక్ లేదా ప్రచారకుడు). ఆయన I Could Not Be Hindu: The Story of a Dalit in the RSS అనే పుస్తకాన్ని రాశారు.
రామజన్మభూమి ఉద్యమంలో భాగంగా బాబ్రీ మసీదు కూల్చివేతలో పాల్గొన్నారు. భారతదేశంలోని అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేసి రాముని ఆలయాన్ని నిర్మించడం గురించి ఉద్యమం జరిగింది, ఎందుకంటే కొంతమంది హిందువులు రామ జన్మస్థలం ఖచ్చితమైన ప్రదేశం అని ఒకప్పుడు బాబ్రీ మసీదు నిర్మించబడిందని పేర్కొన్నారు. ఈ కూల్చివేతకు అతను మిగతా RSS సభ్యులతో రైలులో బయలుదేరారు.
అతను ఈ క్రింది పేర్కొన్న షాకింగ్ నిజాలను తన పుస్తకంలో చెప్పారు.
రైల్వే స్టేషన్ నుండి రైలు కదలడం మొదలుపెట్టాక, RSS ముఖ్య కార్యకర్తలందరూ రైలు నుండి వెళ్లిపోయారు. పెద్ద నాయకులు, పారిశ్రామికవేత్తలు, సంఘ్ ప్రచారక్‌లు, VHP మరియు BJP నాయకులు అందరూ ఒకరి తర్వాత ఒకరు తప్పించుకున్నారు. మాకు శుభాకాంక్షలు చెప్పి, వారు తమ ఇళ్లకు తిరిగి వెళ్లారు. నాలాంటి ఉద్రేకపూరిత దళితులు, ఆదివాసీలు, ఇతర అట్టడుగు కులాల యువకులు, కొంతమంది సాధువులు మాత్రమే మిగిలారు. మాకు బాధ్యత వహించడానికి, కొంతమంది దిగువ స్థాయి కార్యనిర్వాహకులు మాకు సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తూ ఇలా అన్నారు “చింతించకండి, వెళ్ళిపోయిన నాయకులు వేరే వాళ్ళను కలవాలి. తర్వాత వారు మనల్ని నేరుగా అయోధ్యలో కలుస్తారు.” కానీ వాళ్ళు ఎప్పుడూ అయోధ్యకు రాలేదు. వాళ్ళు తెలివైన వాళ్ళు, ఇంటికి వెళ్లిపోయారు. తెలివిగల వాళ్ళు ఎల్లప్పుడూ మనల్ని ఉపయోగించుకుంటారని నేను అర్థం చేసుకున్నాను. ఉద్రకంతో ఉండే మనల్ని వారు యుద్ధంలోకి నెట్టివేసి, వారి సురక్షితమైన గూటికి తిరిగి వెళతారు. ఇందులో వారి గొప్పతనం ఉంది; బహుశా గొప్పతనం ఉంది అనేది కుతంత్రానికి మరో పదం.
తన పుస్తకం 'Why I Could Not be Hindu' లో భన్వర్ మేఘవంశీ, మాజీ RSS విస్తారక్ (జూనియర్ ప్రచారక్) Tweet
RSS ఉన్నత కుల సభ్యుల నుంచి రహస్యంగా సేకరించిన ఉత్తరం ఆధారంగా ఆయన మరో షాకింగ్ విషయాన్ని వెల్లడించారు.
ఈ కుల వ్యవస్థ కారణంగానే హిందూ సమాజం మనుగడ సాగిస్తుంది అని, కుల వ్యవస్థ లేకుంటే అందరూ ముస్లింలుగానో, క్రైస్తవులుగానో మారి ఉండేవారు అని ప్రచారం చేయాలి అని ఆ ఉత్తరం చెబుతుంది.
ఇది కేవలం హిందూ సమాజంలో కుల వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి RSS చేసే ఒక కుట్ర.
Brut India తో అతని ఇంటర్వ్యూని మీరు క్రింద వీడియో లో చూడవచ్చు.
The Quint న్యూస్ ఛానల్ తో అతని ఇంటర్వ్యూని మీరు క్రింద వీడియో లో చూడవచ్చు.
బ్రాహ్మణీయ కుట్రల వెనుక సూత్రధారులైన ఆర్‌ఎస్‌ఎస్ అగ్రనేతలు ఎక్కువగా బ్రాహ్మణులు మరియు ఇతర అగ్రవర్ణాలకు చెందినవారే ఉంటారు. ఆర్‌ఎస్‌ఎస్ కుట్రపన్నిన వివాదాల్లో పాల్గొనడం, ముస్లింలు, క్రైస్తవులపై దాడులు చేయడం, అల్లర్లలో గాయపడే లేదా చనిపోయే వాళ్లలో మరియు ఆ వివాదాలలో నష్టపోయే బాధితులలో ఎక్కువమంది వెనుకబడిన కులాలకు చెందిన వారే ఉంటారు.
Footnotes
- Page no 358, 'Pakistan or the Partition of India', Dr B. R. Ambedkar, https://www.mea.gov.in/Images/attach/amb/Volume_08.pdf
- Page no 29, Integral Humanism by RSS ideologue Deendayal Upadhyaya
https://deendayalupadhyay.org/images/book/Booklet%20on%20IntegralHumanism.pdf
- Page no 129, We or Our Nationhood Defined, M. S. Golwalkar:
https://sanjeev.sabhlokcity.com/Misc/We-or-Our-Nationhood-Defined-Shri-M-S-Golwalkar.pdf
- Page no 32, Essentials of Hindutva, Savarkar: https://savarkar.org/en/encyc/2017/5/23/2_12_12_04_essentials_of_hindutva.v001.pdf_1.pdf