వాస్తవాలు తెలుసుకోండి.
మూల కారణంతో పోరాడండి.
90% భారతీయులను ప్రభావితం చేసే కుల వ్యవస్థను మరియు దానిలో అంతర్లీనంగా ఉన్న సామాజిక, ఆర్ధిక మరియు లింగ అసమానతలను నిర్మూలిద్దాం
కుల వ్యవస్థ సమస్య కేవలం కుల వివక్ష మాత్రమే కాదు.
పై చిత్రంలో పేర్కొన్న సమస్యలన్నింటికి కుల వ్యవస్థ ఒక్కటే కారణం కాదు, కానీ కుల వ్యవస్థ ఒక కారణం. దీనిని గురుంచి మరింత తెలుసుకోవడానికి ఈ సోషల్ మీడియా పోస్టుని చదవండి. గమనిక: ఇప్పుడు గణాంకాలు భిన్నంగా ఉండవచ్చు.
ముఖ్యమైన పోస్టులు - బ్రాహ్మణవాదం మరియు సనాతన ధర్మం బహిర్గతం, బ్లాగ్ సిరీస్
ప్రాచీన మతమైన వైదిక బ్రాహ్మణ మతం (వాదం) నుండి హిందూ మతం ఎలా ఉద్భవించిందో మరియు బ్రాహ్మణ వాదులు తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి 3,000 సంవత్సరాలు మతం ముసుగులో వర్ణ వ్యవస్థ (సనాతన ధర్మం) మరియు కుల వ్యవస్థను ఎలా సజీవంగా ఉంచారో మరియు ఇప్పుడు హిందువులను నకిలీ జాతీయవాద భావజాలంతో బ్రాహ్మణ వాదులు ఎలా మోసం చేస్తున్నారో తెలుసుకోండి.
వికీపీడియా, ప్రధాన వార్తా వెబ్సైట్లు, బ్రాహ్మణ వాదుల వెబ్సైట్లు, ఇతర ప్రముఖమైన వెబ్సైట్లలో హిందూ మతం, సనాతన ధర్మం, మరియు కుల వ్యవస్థ గురుంచి పేర్కొన్న సమాచారం అంతా నిజం కాదు. ఎందుకంటే, బ్రాహ్మణ వాదులు భారతదేశ మరియు హిందూ మత చరిత్రను వక్రీకరిస్తూ వచ్చారు.
హిందుత్వ ఫాసిజం అనేది వినాశకరమైన ముస్సోలిని ఫాసిజం మరియు హిట్లర్ యొక్క నాజీయిజం యొక్క మిశ్రమం.
అయోధ్యలో కూల్చివేసిన బాబ్రీ మసీదు స్థానంలో రామమందిర నిర్మాణం ప్రారంభమైంది. తదుపరి, కృష్ణ జన్మభూమి, కాశీ విశ్వనాథ దేవాలయం. కృష్ణ జన్మభూమి శిథిలాల మీద షాహీ ఈద్గా మసీదు నిర్మించబడిందని మరియు కాశీ విశ్వనాథ ఆలయ శిథిలాలపై జ్ఞానవాపి మసీదు నిర్మించబడిందని హిందుత్వ జాతీయవాదులు వాదిస్తారు. ఈ ప్రదేశాల
రామ మందిరానికి, RSS సనాతన ప్రచారానికి, 1922 సంవత్సరానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి?
అధికార పార్టీ మరియు దాని అనుబంధ సంస్థలు హిందువులలో ద్వేషాన్ని మరియు మూఢనమ్మకాలను విపరీతంగా వ్యాప్తి చేస్తున్న ప్రస్తుత రాజకీయ వాతావరణంలో, హిందువులకు, ముఖ్యంగా జెనరేషన్ Z (1995 మరియు 2009 మధ్య జన్మించిన వారు) హిందుత్వ వాదం యొక్క నిజమైన ఉద్దేశ్యం మరియు అది హిందువులను ఎలా
సనాతన ధర్మం (వర్ణ వ్యవస్థ) స్త్రీలందరితో సహా 90% భారతీయుల పట్ల వివక్ష చూపుతోంది
ఈ 40+ పేజీల బ్లాగ్ సిరీస్ చదివిన తర్వాత, మీరు ఈ క్రింది విషయాలు అర్థం చేసుకుంటారు: సనాతన ధర్మం హిందూమతం కాదు, స్థానిక భారతీయులపై తమ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి వలస వచ్చిన ఇండో-ఆర్యులు (వైదిక బ్రాహ్మణులు, క్షత్రియులు & వైశ్యులు) సృష్టించిన కుల వ్యవస్థ. వేదాలు, పురాణాలు,
హిందూమత, భారత దేశ చరిత్రను బ్రాహ్మణ వాదులు వక్రీకరించారు. హిందూమతం సనాతన ధర్మం కాదు.
చాలా మంది భారతీయులకు హిందూ మతం యొక్క నిజమైన చరిత్ర తెలియదు. పురాతన భారతీయ వైదిక బ్రాహ్మణవాదం మరియు ప్రస్తుత హిందూ మతం ఒక్కటే అని వారు భావిస్తున్నారు. అలాగే, వారు హిందూమతం సనాతనమని, అంటే ఎప్పటి నుంచో మార్పు లేకుండా కొనసాగుతుందని నమ్ముతారు. దీనికి కారణం హిందూ
సనాతన ధర్మం, హిందుత్వ మరియు RSS: బ్రాహ్మణీయ కుట్ర బహిర్గతం
హిందుత్వ మరియు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) కి సంక్షిప్త పరిచయం RSS 1925లో స్థాపించబడిన అతివాద సంస్థ. హిందుత్వ అనేది RSS యొక్క నకిలీ జాతీయవాదంపై ఆధారపడిన రాజకీయ సిద్ధాంతం. దీని లక్ష్యం భారతదేశంలో హిందూ ఆధిపత్యాన్ని స్థాపించడం లాగా కనిపిస్తుంది, అయితే దాని అసలు
బ్రాహ్మణ ఆధిపత్యాన్ని మరియు సనాతన ధర్మాన్ని రుజువు చేసే గణాంకాలు
బ్రాహ్మణ వాదం కేవలం బ్రాహ్మణుల ఆధిపత్యం కాదు; ఇది అనేక సామాజిక-ఆర్థిక అసమానతలకు మూల కారణం ఈ పోస్ట్‌లో, ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, ప్రైవేట్ రంగ ఉద్యోగాలు, విద్యా సంస్థలు, న్యాయ వ్యవస్థ, రాజకీయాలు, క్రీడలు మరియు చాలా రంగాలలో బ్రాహ్మణులు ఆధిపత్యం చెలాయించడానికి సనాతన ధర్మం లేక
తాజా పోస్ట్‌లు
మతం vs. HDI. మానవాభివృద్ధికి మతం పెద్ద అడ్డంకి.
సారాంశం గ్రాఫ్ 1: వారి రోజువారీ జీవితంలో మతం చాలా ముఖ్యమైనదని చెప్పిన వారు ఎక్కువ మంది ఉన్న దేశాలు మానవ అభివృద్ధి సూచిక (HDI) లో వెనుకబడి ఉన్నాయి. గ్రాఫ్ 2: ఏ మత నమ్మకాలు లేనివారు ఎక్కువమంది ఉన్న దేశాలు అసమానత-సర్దుబాటు చేసిన మానవ అభివృద్ధి
సోషల్ మీడియా పోస్టులు
ఇంస్టాగ్రామ్
బ్లాగు గురుంచి
అందరికీ నమస్కారం, నా పేరు బి. సాయి ప్రసన్న కుమార్ లేదా సంక్షిప్తంగా బిఎస్‌పి కుమార్ (BSP Kumar).
నేను నాస్తికుడిని, హేతువాదిని మరియు మానవతావాదిని.
ఎవరైనా మనల్ని ఆర్ధిక మరియు సామజిక సమస్యలకు మూల కారణాలను తెలుసుకోనివ్వకుండా, లేదంటే మూల కారణాలను ప్రశ్నించడకూడదు అని మనల్ని మోసం చేస్తూ ఉంటే, మనం ఎప్పటికీ ఆ సమస్యను పరిష్కరించలేము. ఇలాంటి కారణాల వల్లే ప్రపంచంలో అనేక సామజిక-ఆర్ధిక సమస్యలు దీర్ఘకాలంగా కొనసాగుతూ వచ్చాయి. ఇలాంటి సమస్యలకు మూల కారణాలు అయిన వివిధ మత, రాజకీయ, మరియు సాంస్కృతిక భావజాలాలను మరియు ఆచారాలను దోపిడీదారులు, వివక్ష చూపే వారు లేదా మూఢ నమ్మకాలను నమ్మే వాళ్ళు బలపరుస్తూ వచ్చారు.
వర్ణ వ్యవస్థ లేదా సనాతన ధర్మం నుండి పరిణామం చెందిన కుల వ్యవస్థ భారతదేశంలో అనేక సామాజిక-ఆర్థిక సమస్యలు మరియు కుల మరియు లింగ వివక్షకు మూల కారణం. ఇది 90% భారతీయులను ప్రభావితం చేస్తుంది. అయితే ఇది వెనుకబడిన కులాలను మాత్రమే ప్రభావితం చేస్తుందని చాలా మంది భారతీయులు భావిస్తున్నారు.
వైదిక మతం నుండి ఉద్భవించిన పురాతన మతమైన వైదిక బ్రాహ్మణ మతంలో వర్ణ వ్యవస్థ అంతర్భాగం. ఇది క్రీస్తు పూర్వం సుమారు 1500 లో ప్రస్తుత ఇరాన్ ప్రాంతం నుండి భారత ఉపఖండానికి వలస వచ్చిన ఆర్యుల మతం. ఇండో-ఆర్యుల, ముఖ్యంగా వైదిక బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని కొనసాగించడానికి మరియు సింధు లోయ స్థిరనివాసుల మరియు ఇతర స్థానిక భారతీయులను దోపిడీ చేయడానికి అత్యంత వివక్షా పూరితమైన ఈ వర్ణ వ్యవస్థను మతం పేరుతో అమలు చేశారు.
బ్రాహ్మణవాదం అసలు రూపం తెలియక దానిని గుడ్డిగా అనుసరిస్తూ, మరియు బలపరుస్తూ తమను తామే సుమారుగా 3000 సంవత్సరాలు భాదితులను చేసుకుంటూ వస్తున్నారు.
ఇంకొక కారణం ఏంటంటే, బ్రాహ్మణవాదం వైదిక బ్రాహ్మణవాదం మరియు బ్రాహ్మణీకరించబడిన హిందుమతాల మరియు హిందుత్వ లాంటి రాజకీయ భావజాల ముసుగులో చెలామణి అవుతూ వస్తుంది. తమ లబ్ది కోసం వర్ణ వ్యవస్థను సృష్టించిన బ్రాహ్మణవాదులు చరిత్రను వక్రీకరించి, ఆ వ్యవస్థను బలపరిచే విధంగా దొంగ దేవుళ్ల మరియు వీరుల కధలను సృష్టించి, ఆ భావజాలానికి మతపరమైన పవిత్రతను ఆపాదించి, దానిని ప్రశ్నించకుండా ఉండేటట్టు భాదితులను బ్రెయిన్ వాష్ చేశారు. ఈ విధంగా 3000 సంవత్సరాలుగా తమ ఆధిపత్యాన్ని చెలాయిస్తూ, మిగతా వారిపై వివక్ష చూపుతూ, దోపిడీకి గురిచేస్తూ వచ్చారు.
ఈ బ్లాగ్ లో బ్రాహ్మణవాదం, మరియు ప్రపంచంలో అనేక సామజిక-ఆర్ధిక సమస్యలకు మూలకారణాలు అయిన బ్రాహ్మణవాదం లాంటి ఇతర మత, రాజకీయ, మరియు సాంస్కృతిక భావజాలాలను నేను చర్చిస్తాను. కానీ నేను కుల వ్యవస్థ మరియు దానిలో అంతర్లీనంగా ఉన్న లింగ అసమానత గురించి మరింత చర్చిస్తాను, ఎందుకంటే ఇది 90% భారతీయులను ప్రభావితం చేస్తుంది మరియు భారతదేశంలోని అనేక సామాజిక-ఆర్థిక సమస్యలకు మూలకారణం. ఇంకా, ఈ సామజిక-ఆర్ధిక సమస్యలను పరిష్కరించడంలో హేతువాదం మరియు మానవతావాదం ఎంత బాగా ఉపయోగపడుతుందో చర్చిస్తాను.
* బ్రాహ్మణ వాదులంటే వర్ణ లేక కుల వ్యవస్థను, దానిలో అంతర్భాగమైన లింగ వివక్షను పాటించే లేదా అమలు చేసే వ్యక్తులు. చరిత్రలో బ్రాహ్మణ వాదులంటే వైదిక బ్రాహ్మణులు. కానీ దానివల్ల లబ్ది పొందుతుండడం వల్ల ఇప్పుడు చాలా మంది బ్రాహ్మణేతరులు ఎక్కువగా బ్రాహ్మణ వాదులుగా మారుతున్నారు. బ్రాహ్మణులందరూ బ్రాహ్మణ వాదులు కాదు, బ్రాహ్మణ వాదంపై వ్యతిరేకంగా పోరాడిన వాళ్లలో బ్రాహ్మణులు కూడా ఉన్నారు. నా అభిప్రాయాలు బ్రాహ్మణవాదానికి వ్యతిరేకం, బ్రాహ్మణులపై కాదు.
అంతిమ విషాదం చెడ్డవారి అణచివేత మరియు క్రూరత్వం కాదు, మంచి వ్యక్తులు దానిపై మౌనంగా ఉండటం.
మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ Tweet
Source: “Equality Vs Equity” (సమానత్వము vs. సమన్యాయము) by Community Eye Health is licensed under CC BY-NC 2.0.