అధికార పార్టీ మరియు దాని అనుబంధ సంస్థలు హిందువులలో ద్వేషాన్ని మరియు మూఢనమ్మకాలను విపరీతంగా వ్యాప్తి చేస్తున్న ప్రస్తుత రాజకీయ వాతావరణంలో, హిందువులకు, ముఖ్యంగా జెనరేషన్ Z (1995 మరియు 2009 మధ్య జన్మించిన వారు) హిందుత్వ వాదం యొక్క నిజమైన ఉద్దేశ్యం మరియు అది హిందువులను ఎలా మోసం చేస్తోంది అనే దాని గురించి అవగాహన కల్పించడం చాలా ముఖ్యం.
హిందుత్వ వాదం అంటే ఏమిటి మరియు దాని అసలు ఉద్దేశ్యం
భారతీయ సంస్కృతిలోని వైవిధ్యాన్ని హిందూత్వ వాదులు ఎన్నడూ ఇష్టపడలేదు. ఉదాహరణకు, హిందూత్వ సిద్ధాంతకర్తలలో ముఖ్యులలో ఒకరైన దామోదర్ సావర్కర్ తన పుస్తకం Essentials of Hindutva లో నిజమైన హిందువుని ఇలా నిర్వచించారు 1 1. ఉమ్మడి దేశం (హిందూ దేశం), 2. ఉమ్మడి జాతి (ఆర్య) మరియు 3. ఉమ్మడి నాగరికత (వైదిక) కలిగి ఉన్నవారు.
చరిత్ర ప్రకారం ఈ నిర్వచనం సరైనది కాదు. 1. హిందూ మతం ఒక మతంగా 19వ శతాబ్దంలో మాత్రమే ప్రాచుర్యం పొందింది మరియు దేవుడు మరియు వేదాలను నమ్మని బౌద్ధం, జైన మతం మరియు చార్వాక వంటి ఇతర మతాలు లేదా తత్వాలు ఉన్నాయి. 2. ఆర్యులు అనే పదం ఒక జాతిని సూచించదు కానీ ఇండో-ఇరానియన్ భాషలు మాట్లాడే ప్రజలను సూచిస్తుంది. మన పూర్వీకులకు బహుళ జాతుల కలయిక మూలం. 3. వైదిక సంస్కృతికి ముందు సింధూ నాగరికత ఉనికిలో ఉంది. అలాగే, వైదికేతర స్థానిక సంస్కృతులు ఉనికిలో ఉన్నాయి.
హిందుత్వ వాదులు ఆర్యులు భారతదేశానికి చెందిన వారని మరియు ప్రాచీన భారతీయ చరిత్ర అంతా ఉన్నతమైన వైదిక సంస్కృతి అని భారతీయులను మోసం చేస్తున్నారు. అలాగే, వారి భావజాలం ప్రకారం, ‘హిందూ దేశం’ (Hindu Rashtra) లో ఒకే మతం (హిందూ మతం) ఉండాలి మరియు ఒకే భాష (హిందీ) మాట్లాడాలి. ముస్లింలు, క్రైస్తవులు ఇక్కడే పుట్టి జీవిస్తున్నప్పటికీ వారి నిర్వచనం ప్రకారం భారతీయులు కారు. ముస్లింలను భారత చరిత్రలో విలన్లుగా, అణచివేత దారులుగా దుమ్మెత్తిపోస్తున్నారు. హిందూ మతం ముసుగులో హిందూ ఓట్లను ఏకీకృతం చేయడం, మత మార్పిడులను ఆపడం మరియు బ్రాహ్మణ సామాజిక క్రమాన్ని (కుల వ్యవస్థ) కొనసాగించడం హిందుత్వ సామాజిక-రాజకీయ వ్యూహం. అందుకే RSS నకిలీ సమాచారంతో ముస్లింలు, క్రైస్తవులపై విద్వేషాన్ని వ్యాపింపజేస్తోంది.
బెల్జియన్‌లో జన్మించిన భారతీయ ఆర్థికవేత్త జీన్ డ్రెజ్ (Jean Drèze) ఒక వ్యాసంలో ఇలా పేర్కొన్నారు 2
“హిందుత్వ ప్రాజెక్ట్ అగ్రవర్ణాల కోసం ఒక లైఫ్ బోట్, ఇది వారిని అగ్రస్థానంలో ఉంచే విధంగా బ్రాహ్మణీయ సామాజిక వ్యవస్థ (వర్ణ వ్యవస్థ) పునరుద్ధరణకు ఉద్దేశించినది . ఈ కోణంలో చూస్తే, హిందుత్వ జాతీయవాదం ఇప్పుడు బలపడటం భారతదేశంలో కుల నిర్మూలన మరియు మరింత సమాన సమాజాన్ని తీసుకువచ్చే ఉద్యమానికి పెద్ద ఎదురుదెబ్బ.”
జీన్ డ్రేజ్, బెల్జియంలో జన్మించిన భారతీయ ఆర్థికవేత్త Tweet
బ్రాహ్మణ సామాజిక క్రమం అంటే వర్ణ వ్యవస్థ. హిందుత్వ ఉద్దేశ్యం కేవలం బ్రాహ్మణులకే కాకుండా దానిని సమర్ధించే అగ్రవర్ణాల ఆధిపత్యం. అందరిని కలుపుకుపోయేలా కనబడే RSS బాహ్య రూపాన్ని, దాని అంతర్గత కులతత్వ స్వభావాన్ని మరియు దాని కుట్రలను నేను ఈ బ్లాగ్ పోస్ట్‌లో వివరించాను.
అందుకే 1980లో OBC లకు 27% రిజర్వేషన్లు కల్పించాలని సూచించిన మండల్ కమిషన్‌ను వారు వ్యతిరేకించారు మరియు ఇప్పుడు కుల గణనను వ్యతిరేకిస్తున్నారు.
రామ్ నాథ్ కోవింద్, ద్రౌపది ముర్ము వంటి దళిత నేతలను రాష్ట్రపతి పదవులకు ఎన్నుకోవడానికి తాము సమర్థించామని, వెనుకబడిన వర్గాల నాయకులకు టిక్కెట్లు ఇచ్చామని బిజెపి వాదించవచ్చు, కాని వెనుకబడిన వర్గాల నుండి ఎన్నుకున్న నాయకులు బిజెపి మరియు ఇతర ప్రధాన స్రవంతి పార్టీలు వెనుకబడిన కులాల వారిపై చూపించే వివక్షకు వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడరు.
1921-22లో సింధు లోయ నాగరికత (IVC) ఆవిష్కరణ మరియు సనాతన ప్రచారం

ఊహాత్మక చిత్రం: An artist’s impression of Indus Valley Civilization by Amplitude Studios published on worldhistory.org
ఇండో-ఆర్యులు క్రీ.పూ 2,000 తర్వాత వివిధ దశల్లో భారత ఉపఖండానికి వలస వచ్చారు. IVC క్రీ.పూ 3600 నుండి క్రీ.పూ 1300 వరకు కొనసాగింది. 1921-22 లో జరిగిన పురావస్తు త్రవ్వకాలలో వైదిక కాలానికి ముందు నుండే ఉన్న, వైదిక సంస్కృతి కన్నా బాగా అభివ్రిద్ది చెందిన సింధు లోయ నాగరికత (IVC) కనుగొనడం హిందూత్వ ప్రచారానికి పెద్ద దెబ్బ (నిర్వచనం ప్రకారం). సనాతన’ అనే సంస్కృత పదానికి అర్థం శాశ్వతమైనది, ఉనికిలో ఉంది లేదా ఎటువంటి మార్పు లేకుండా శాశ్వతంగా కొనసాగుతుంది. అప్పటి నుంచి, వారు వైదిక సంస్కృతి ‘సనాతనం’ అని ప్రచారం చేయడానికి తగిన లేదా వక్రీకరించిన పురావస్తు డేటాను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు మరియు వైదిక సంస్కృతి IVC కంటే ముందు నుంచే ఉనికిలో ఉందని మరియు ఆర్యులు IVC యొక్క స్థిరనివాసులని ప్రచారం చేస్తున్నారు.
ఒకే జాతి (ఆర్యులు) నుండి భారతీయుల పుట్టారన్న హిందూత్వ వాదుల తప్పుడు నమ్మకం మరియు జాతీయవాద మరియు నిరంకుశత్వ భావజాలానికి సరిపోయే విధంగా పురావస్తు డేటాను వక్రీకరించడం నాజీయిజం (Nazism) వంటి పాశ్చాత్య నిరంకుశత్వం నుంచి కాపీ కొట్టారు.
పురావస్తు త్రవ్వకాల కోసం వారు చారిత్రక ప్రదేశాలకు బదులుగా హిందూ పురాణాలలో పేర్కొన్న ప్రదేశాలను ఎన్నుకున్నారు.
వారు తవ్వకాలు జరిపిన విధానం తరచుగా ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ప్రమాణాల ప్రకారం ఉండదు. వారు రూపొందించిన నివేదికలు కూడా వక్రీకరించబడ్డాయి లేదా అనిశ్చియాత్మకంగా (inconclusive) ఉన్నాయి. బిజెపి హయాంలో హిందూత్వ వాదులు ప్రారంభించిన అలంటి కొన్ని ప్రాజెక్టులు క్రింది పేర్కొన్నాను.
ప్రాజెక్ట్ 'రామాయణ ప్రదేశాల పురావస్తు శాస్త్రం'
1968 నుండి 1972 వరకు, ASI డైరెక్టర్ జనరల్ బ్రజ్ బసి లాల్ అయోధ్యలో తవ్వకాలు నిర్వహించారు. 1990లో, RSS పత్రిక ‘మంథన్’ లో ప్రచురితమైన కథనంలో రామ మందిరం (ధృడమైన అధరాలు లేని) స్తంభాల బేస్ కనుగొనడం గురించి ప్రస్తావించారు. ఈ అత్యంత వివాదాస్పద వాదన మరియు 1992లో జరిగిన ఇతర ఆవిష్కరణలు బాబ్రీ మసీదు కింద రామమందిరం ఉనికిని నిరూపించడానికి సాక్ష్యంగా ఉపయోగించబడ్డాయి. చాలా మంది పురావస్తు శాస్త్రవేత్తలు ఈ వివాదాస్పద నివేదికను ప్రశ్నించారు, దీనిని గురుంచి నేను తదుపరి విభాగంలో చర్చించాను. విశ్వహిందూ పరిషత్ మరియు RSS యొక్క ఇతర అనుబంధ సంస్థల కార్యకర్తలు డిసెంబర్ 6, 1992న బాబ్రీ మసీదును కూల్చి వేశారు.
సనాతన ప్రచారం కోసం సింధు లోయ నాగరికత మరియు భారతీయ చరిత్రను ఆర్యనీకరణ చేయడానికి చేపట్టిన ప్రాజెక్టులు:
హిందుత్వ వాదుల కింది ప్రాజెక్టులు/నివేదికలను పురావస్తు, చారిత్రక, జన్యుశాస్త్రం మరియు భాషా శాస్త్ర అధ్యయనాల నిపుణులు ఖండించారు. నిపుణుల పేర్కొన్న విషయాలతో నా ఇతర బ్లాగ్ పోస్ట్‌లో వీటిని వివరంగా చర్చించాను. నేను మీకు ఇక్కడ సారాంశాన్ని పేర్కొన్నాను.
2000 - IVC యొక్క నకిలీ గుర్రపు ముద్ర
IVC లో గుర్రాలు లేవు మరియు వైదిక సాహిత్యంలో గుర్రాలు విస్తృతంగా ప్రస్తావించబడ్డాయి. వైదిక ప్రజలు IVC యొక్క స్థిరనివాసులు అని నిరూపించడానికి IVC నుండి ఒక ఎద్దు యొక్క ముద్రను గుర్రంగా 2000 లో హిందుత్వ వాదులు వక్రీకరించారు.
2003 - సింధు-సరస్వతి నాగరికత ప్రచారం
బిజెపి ప్రభుత్వం 2003 లో సరస్వతీ వారసత్వ ప్రాజెక్టును (Saraswati Heritage Project) ప్రారంభించింది. వేదాలలో పేర్కొన్న సరస్వతి నది నేటి ఘగ్గర్-హక్రా నది అని వాయువ్య భారతదేశంలో ప్రవహిస్తుంది అని వారు పేర్కొన్నారు. ఈ తప్పుడు ప్రచారానికి ఒక కారణం ఏమిటంటే, భారతదేశం మరియు పాకిస్తాన్ విభజన తర్వాత, చాలా IVC ప్రదేశాలు పాకిస్తాన్‌లో భాగమయ్యాయి మరియు వారు భారతదేశంలోని ఘగ్గర్-హక్రా నది ఒడ్డున ఉన్న ప్రదేశాలను IVC ప్రదేశాలుగా ప్రచారం చేయాలనుకుంటున్నారు.
2019 - DNA అధ్యయనాల తప్పుడు నివేదిక
సెల్ మరియు సైన్స్ సంస్థలు రెండు జన్యు పరిశోధన ప్రాజెక్టుల ఫలితాలను విడుదల చేశాయి. రెండు ప్రాజెక్టులు IVC వైదిక కాలానికి ముందు నుంచే ఉన్నట్లు మరియు భారత ఉపఖండానికి ఆర్యుల వలసలను సూచించాయి. కానీ ఈ ప్రాజెక్టులలో పని చేసిన భారతీయ రచయితలు (బీజేపీ రాజకీయ ఒత్తిళ్లు లేదా ఇతర కారణాల వల్ల కావచ్చు) ఆర్యుల వలసలు లేవని పేర్కొన్నారు. ఇతర రచయితలు భారతీయ రచయితలతో ఏకీభవించలేదు.
2020 - వారసత్వం మరియు పరిరక్షణ ప్రాజెక్టులు
ఐదు పురావస్తు ప్రదేశాలను అక్కడ మ్యూజియంలతో ఐకానిక్ ప్రదేశాలుగా అభివృద్ధి చేస్తామని బిజెపి ప్రభుత్వం ప్రకటించింది [1]. అవి: రాఖీగర్హి (హర్యానా), హస్తినాపూర్ (ఉత్తరప్రదేశ్), శివసాగర్ (అస్సాం), ధోలవీర (గుజరాత్) మరియు ఆదిచనల్లూర్ (తమిళనాడు). రాఖీగర్హి మరియు ధోలావిరా IVC ప్రదేశాలు. ఈ ప్రదేశాలు అన్నీ BJP లేదా BJP దాని పొత్తులతో పాలించే రాష్ట్రాల్లో ఉన్నాయి.
దాని ఉనికికి ఎటువంటి దృఢమైన రుజువు లేని రామమందిరం చుట్టూ రాజకీయం
బ్రాహ్మణ సాహిత్యం మరియు చారిత్రక రికార్డులలో బలమైన రుజువు లేదు
"రాముని చారిత్రాత్మకతను విశ్వసించే వారు పౌరాణిక వంశ వృక్షం ఆధారంగా క్రీ.పూ. 1800లో అతని కాలాన్ని నిర్ధారిస్తారు. కానీ క్రీస్తుపూర్వం 500 వరకు అయోధ్యలో స్థిరనివాసాలు ఉన్నట్టు కనుగొనబడలేదు. అలాగే, క్రీ.శ 300 కు చెందినది గా నమ్మే విష్ణు స్మృతి, 85వ అధ్యాయంలో పుణ్యక్షేత్రాల గురించి ప్రస్తావించబడింది, కానీ అది అయోధ్య గురించి ప్రస్తావించలేదు."
పురావస్తు శాస్త్రవేత్తలు R లేటన్, P స్టోన్ మరియు J థామస్ Tweet
"అయోధ్య ఆలయం నుండి రాతి స్తంభాలను మసీదు స్వాధీనం చేసుకునే అవకాశం ఏమి కనిపించడం లేదు. లక్నోస్టేట్ మ్యూజియం మరియు ది అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ స్టడీస్, వారణాసికి చెందిన రెండు ముఖ్యమైన జాబితాలలో (historical catalogs.) మసీదులో స్తంభాలపై డిజైన్లకు బౌద్ధ సంబంధాలు ఉన్నాయని, కానీ అయోధ్యలో ఎటువంటి బ్రాహ్మణ విగ్రహాల (హిందూ మత) గురించి పేర్కొనబడలేదు."
పురావస్తు శాస్త్రవేత్తలు R లేటన్, P స్టోన్ మరియు J థామస్ Tweet
ASI త్రవ్వకాల్లో ఎటువంటి ప్రమాణాలు పాటించబడలేదు మరియు చెల్లుబాటు అయ్యే పురావస్తు ఆధారాలు లేవు
ASI 2002లో అయోధ్యలో తవ్వకాలు జరిపి నివేదికను 2003లో అలహాబాద్ హైకోర్టుకు సమర్పించింది. ASI 2003 నివేదిక ఆధారంగా రామమందిర నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు 2019లో తీర్పునిచ్చింది. ధనేశ్వర్ మండల్, షెరీన్ రత్నాగర్, సుప్రియా వర్మ, జయ మీనన్ మరియు ఇతర పురావస్తు శాస్త్రవేత్తలు కోర్టులో వాడిన సాక్ష్యాలు ప్రశ్నార్ధకంగా ఉన్నాయని చెప్పారు మరియు ఫలితాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
నివేదికలో పేర్కొన్న 12 శిధిలాల అంశాలు బౌద్ధ లేదా జైన చిహ్నాలను సూచిస్తున్నాయని వర్మ మరియు మీనన్ చెప్పారు. 6
“నివేదికలో ప్రత్యేకంగా పేర్కొన్న12 (శిధిలాలు) విషయానికొస్తే, మొత్తం 12 మట్టి దిబ్బల ఉపరితలంపై పడి ఉన్న శిధిలాల నుండి వచ్చాయి, బాబ్రీ మసీదు కింద జరిగిన తవ్వకం నుండి కాదు. ముందుగా చెప్పినట్లుగా, శిధిలాలు చెల్లుబాటు అయ్యే పురావస్తు ఆధారాలు కావు ఎందుకంటే అవి సీలు చేసిన నిక్షేపాలు కావు. ఈ తవ్వకంలో, బాబ్రీ మసీదు నేల కింద దొరికిన సాక్ష్యం వాస్తవానికి పరిగణించవలసినది, నేల పైన పడి ఉన్నది కాదు. 12 శిధిలాలు 'శ్రీవత్స' డిజైన్ (అంతులేని ముడికి చిహ్నం) తో కూడిన రాతి పలకను కలిగి ఉన్నాయి , ఇది జైనమతానికి సంబంధించినది; లోటస్ డిజైన్‌తో కూడిన రాతి స్లాబ్, ఇది బౌద్ధ లేదా జైన ప్రాతినిధ్యాలలో కూడా చిహ్నంగా ఉండవచ్చు; loezenge డిజైన్ లో ఉన్న రాతి పలక బాబ్రీ మసీదుకు చెందినది కావచ్చు ఎందుకంటే అది మసీదుపై ఉన్న అరబిక్ శాసనం యొక్క దిగువ భాగానికి సరిపోలినందున"
పురావస్తు శాస్త్రవేత్తలు సుప్రియ వర్మ మరియు జయ మీనన్ Tweet
తీవ్ర వివాదాస్పద సుప్రీంకోర్టు తీర్పు
చరిత్రకారిణి రొమిలా థాపర్ ఇలా అన్నారు 7
“భారత పురావస్తు సర్వే (ASI) యొక్క త్రవ్వకాలు మరియు దాని రీడింగులను ఇతర పురావస్తు శాస్త్రజ్ఞులు మరియు చరిత్రకారులు గట్టిగా వివాదాస్పదం చేసినప్పటికీ పూర్తిగా అంగీకరించారు (న్యాయమూర్తులు). ఒక న్యాయమూర్తి తాను చరిత్రకారుడు కానందున చారిత్రక కోణాన్ని లోతుగా పరిశోధించలేదని పేర్కొన్నాడు, అయితే ఈ వ్యాజ్యాలను (lawsuites) నిర్ణయించడానికి చరిత్ర మరియు పురావస్తు శాస్త్రం ఖచ్చితంగా అవసరం లేదని చెప్పాడు!”
చరిత్రకారిణి రొమిలా థాపర్ Tweet
మనం ఆందోళన చెందాల్సిన విషయం ఏమిటంటే, అన్యాయమైన తీర్పు గురించి మాత్రమే కాదు, ఇంకా ఇలాంటి ప్రాజెక్టులను ప్లాన్ చేయడానికి RSS ఈ తీర్పును ఎలా ఉపయోగించుకుంటుంది మరియు హిందువులను మోసం చేసే రామ మందిరం చుట్టూ ఉన్న రాజకీయాల గురుంచి కూడా.
మండల్ కమీషన్, రామ మందిరం మరియు కమండల్ రాజకీయాలు 1.0 మరియు 2.0
హిందుత్వ కమండల్ రాజకీయాలు 1.0
ముందుగా చెప్పినట్లుగా, మండల్ కమిషన్ 1980లో వెనుకబడిన వర్గాలకు (OBCలు) 27% రిజర్వేషన్‌లను సూచించింది. V P సింగ్ ప్రభుత్వం ఆగస్టు, 1990లో రిజర్వేషన్‌లను అమలు చేయాలనే ఉద్దేశాన్ని ప్రకటించింది. ఇది అభివ్రిద్ది చెందిన కులాల వారి నుంచి తీవ్ర నిరసనలకు దారితీసింది.
VP సింగ్ ప్రభుత్వం 1992లో విస్తృత నిరసనలు ఉన్నప్పటికీ ఉద్యోగ ఖాళీలు మరియు విద్యా సీట్లలో OBC లకు 27% రిజర్వేషన్లను అమలు చేసింది.

సెప్టెంబరు, 1990లో అప్పటి BJP అధ్యక్షుడు, L. K. అద్వానీ రామరథ యాత్రను ప్రారంభించారు. BJP ప్రకారం ఈ యాత్ర ఉద్దేశ్యం బాబ్రీ మసీదు స్థలంలో రామమందిరాన్ని నిర్మించడం కోసం RSS కూటమి-సంస్థ అయిన విశ్వహిందూ పరిషత్ (VHP) నేతృత్వంలోని ఆందోళనకు మద్దతు ఇవ్వడం. కానీ వారి అసలు లక్ష్యం మూడు ప్రధాన ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది: 1. హిందూ పురాణాలను చరిత్రగా (ఆర్యుల) నిరూపించడం (తప్పుగా) 2. OBC రిజర్వేషన్ల అమలు కారణంగా చీలిపోయే అవకాశం ఉన్న హిందూ ఓట్లను ఏకీకృతం చేయడం 3. అభివ్రిద్ది చెందిన కులాల ఆధిపత్యానికి OBC రిజర్వేషన్ల ముప్పును ఎదుర్కోవడం.
వీటన్నింటిని కలిపి కమండల్ రాజకీయాలు అంటారు. రథయాత్ర సందర్భంగా జరిగిన ఘర్షణల్లో 500 మందికి పైగా మరణించారు మరియు 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో సుమారు 2,000 మంది మరణించారు. మృతుల్లో హిందువులు మరియు ముస్లింలు ఉన్నారు.
కమండల్ రాజకీయాలు బిజెపి లోక్‌సభ స్థానాలను 35 నుండి 120కి పెంచడానికి మరియు 11.36% ఓట్ల వాటాను పెంచడానికి సహాయపడ్డాయి.
హిందుత్వ కమండల్ రాజకీయాలు 2.0
ఇంతకు ముందు చెప్పినట్లుగా, రామజన్మభూమి ఉద్యమం యొక్క అసలు ఉద్దేశ్యం రామమందిరాన్ని నిర్మించడం కాదు, ముస్లింలపై ద్వేషాన్ని వ్యాప్తి చేయడం ద్వారా హిందూ ఓట్లను ఏకీకృతం చేయడం దాని లక్ష్యాలలో ఒకటి. RSS నుంచి వైదొలిగిన తర్వాత రామజన్మభూమి ఉద్యమం అసలు ఉద్దేశ్యాన్ని RSS మాజీ సభ్యుడు శంకర్‌రెడ్డి బయటపెట్టారు.
అతను ఇలా చెప్పారు,
“మోహన్ భగత్ ఎన్నికల తర్వాత చెప్పిన దానిని విన్నాక షాక్ అయ్యాను. అతను ఒకసారి నాతో వ్యక్తిగతంగా ఇలా చెప్పాడు, “ రామ మందిరాన్ని నిర్మిస్తే, మనము హిందువులు మరియు ముస్లింల మధ్య మతపరమైన అల్లర్లు సృష్టించలేము మరియు ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులను రెచ్చగొట్టలేము.”
RSS మాజీ సభ్యుడు శంకర్‌రెడ్డి Tweet
RSS యొక్క కులతత్వ మరియు మత స్వభావాన్ని బహిర్గతం చేసిన RSS మాజీ సభ్యుల మరిన్ని ఉదాహరణలు నేను ఈ బ్లాగ్ పోస్ట్‌లో ఇచ్చాను:
కమండల్ 2.0 అంటే రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతుండగా రామ మందిర ప్రారంభోత్సవం. ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్న కుల గణనను ఎదుర్కోవడానికి మరియు హిందూ ఓట్లను ఏకీకృతం చేయడానికి ఇది బిజెపికి సహాయపడుతుంది.
RSS, బీజేపీ, అనుబంధ సంస్థలు హిందువులను ఇలా మోసం చేస్తున్నాయి.
Footnotes
- Page no. 85 and 116, Essentials of Hindutva by Damodar Savarka: https://archive.org/details/essentials-of-hindutva-veer-savarkar_202106.
- The Revolt of the Upper Castes' by economist Jean Drèze:
https://www.theindiaforum.in/article/revolt-upper-castes. - page 127, Destruction and Conservation of Cultural Property by R Layton, P. Stone, & J Thomas: https://books.google.co.in/books?id=hEOFAgAAQBAJ&printsec=frontcover#v=snippet&q=1800%20BC&f=false.
- page 132-133, Destruction and Conservation of Cultural Property by R Layton, P. Stone, & J Thomas: https://books.google.co.in/books?id=hEOFAgAAQBAJ&printsec=frontcover#v=snippet&q=Buddhist%20affinities&f=false.
- Chapter 85, Vishnu Smriti: http://oaks.nvg.org/vishnu-institutes.html#85
- Was There a Temple under the Babri Masjid? Reading the Archaeological 'Evidence' by SUPRIYA VARMA and JAYA MENON: https://www.jstor.org/stable/25764216.
- 'The verdict on Ayodhya: a historian's perspective' by Romila Thapar: https://www.thehindu.com/opinion/op-ed/The-verdict-on-Ayodhya-a-historians-perspective/article15523346.ece?.