సారాంశం
గ్రాఫ్ 1:
వారి రోజువారీ జీవితంలో మతం చాలా ముఖ్యమైనదని చెప్పిన వారు ఎక్కువ మంది ఉన్న దేశాలు మానవ అభివృద్ధి సూచిక (HDI) లో వెనుకబడి ఉన్నాయి.
గ్రాఫ్ 2:
ఏ మత నమ్మకాలు లేనివారు ఎక్కువమంది ఉన్న దేశాలు అసమానత-సర్దుబాటు చేసిన మానవ అభివృద్ధి సూచిక (IHDI) లో ముందంజలో ఉన్నాయి.
HDI మరియు పోల్ డేటా గురించి
United Nations Development Programme (UNDP) మరియు Gallup పోల్స్ నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ గ్రాఫ్ లను ప్లాట్ చేశాను.
HDI
మానవ అభివ్రిద్ది సూచిక (HDI) అనేది వివిధ దేశాల్లోని వ్యక్తుల జీవన కాలపు అంచనా, విద్యా స్థాయిలు మరియు తలసరి ఆదాయ సూచికల వంటి మానవాభివృద్ధికి సంబంధించిన మూడు ముఖ్యమైన సూచికల ఆధారంగా దేశాలకు ర్యాంక్ ఇచ్చే గణాంక సూచిక.
IHDI
పైన పేర్కొన్న మూడు సూచికలలో అసమానతలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత HDIని సర్దుబాటు చేయడానికి UNDP 2010లో ‘అసమానత-సర్దుబాటు చేసిన మానవ అభివృద్ధి సూచిక’ (IHDI) ను ప్రవేశపెట్టింది. HDI ని మానవ అభివృద్ధి కొలతల్లో సగటు విజయాల సూచికగా చూడవచ్చు. IHDI మానవ అభివ్రిద్ది జనాభాలో ఏవిధంగా పంపిణీ చేయబడిందో వివరించే సూచిక. IHDI అనేది HDI కి సమానం అయితే, సమాజంలో సమానత్వం ఉందని అర్ధం. అసమానత ఉంటే, IHDI విలువ HDI విలువ కన్నా తక్కువ ఉంటుంది.
2022లో, HDI లో 192 దేశాలలో భారతదేశం 132వ స్థానంలో మరియు IHDI లో 122వ స్థానంలో ఉంది.
గాలప్ (Gallup) పోల్
ఒక దేశంలో మత నమ్మకాలు లేని వారి శాతం మరియు వివిధ దేశాలలో మతం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవడానికి నేను Gallup యొక్క పరిశోధన డేటాను ఉపయోగించాను. Gallup, Inc. అమెరికా లోని ఒక ఎనలిటిక్స్ మరియు అడ్వైజరీ కంపెనీ.
ఒక దేశంలో మతం ఎంత ముఖ్యమో తెలుసుకోవడానికి, గాలప్ నిర్వహించిన పోల్ లో “మీ రోజువారీ జీవితంలో మతం ముఖ్యమా?” అని ప్రతివాదులను (respondents) అడిగింది.
గ్రాఫ్‌లను అర్థం చేసుకోవడం
పియర్సన్ సహసంబంధ గుణకం (Pearson’s correlation coefficient) ‘r’ రెండు వేరియబుల్స్ మధ్య సంబంధం యొక్క బలాన్ని కొలుస్తుంది. ఈ సందర్భంలో, మనం మానవ అభివృద్ధి సూచికలకు (HDI) మరియు మతానికి మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము.
‘r’ విలువ +1 నుండి -1 వరకు ఉంటుంది.
‘r’ విలువను బట్టి రెండు వేరియబుల్స్ మధ్య సంభందం అర్ధం చేసుకోవడానికి క్రింద పేర్కొన్న వివరణ మీకు దోహదపడుతుంది.
+/- 1.0 = ఖచ్చితమైన సానుకూల/ప్రతికూల సంబంధం.
+/- 0.8 నుండి +/- 1.0 = చాలా బలమైన సానుకూల/ప్రతికూల సంబంధం.
+/- 0.6 నుండి +/- 0.8 = బలమైన సానుకూల/ప్రతికూల సంబంధం.
+/- 0.4 నుండి +/- 0.6 = మితమైన సానుకూల/ప్రతికూల సంబంధం.
+/- 0.2 నుండి +/- 0.4 = బలహీనమైన సానుకూల/ప్రతికూల సంబంధం.
+/- 0.0 నుండి +/- 0.2 = చాలా బలహీనమైన సానుకూల/ప్రతికూల లేదా సంబంధం లేదు.
గ్రాఫ్ 1 ‘r’ విలువ 0.8. ఇది రోజువారీ జీవితంలో మతానికి ప్రాముఖ్యత ఇవ్వడం మరియు బలహీన మానవ అభివృద్ధి (HDI) మధ్య చాలా బలమైన ప్రతికూల సంబంధం ఉందని సూచిస్తుంది.
గ్రాఫ్ 2 ‘r’ విలువ 0.64. ఇది మరింత మతపరమైన వ్యక్తులు మరియు బలమైన మానవ అభివృద్ధి (IHDI) మధ్య బలమైన సానుకూల సంబంధం ఉందని సూచిస్తుంది.
నేను ఈ క్రింది పేర్కొన్న వేరియబుల్స్ మధ్య కూడా గ్రాఫ్‌లను ప్లాట్ చేసాను, కానీ గణిత నేపథ్యం లేని పాఠకుల కోసం నేను ఈ పోస్ట్‌ను క్లిష్టతరం చేయకూడదనుకుంటున్నాను. అందుకే వాటి గురుంచి చర్చించడం లేదు.
“మతానికి ఎక్కువ ప్రాముఖ్యత” vs HDI (‘r’ విలువ 0.7)
“మత నమ్మకం లేని వారు” vs సామాజిక ప్రగతి సూచిక (SPI) (‘r’ విలువ 0.6).
మీరు ఈ Google షీట్‌లో ఈ డేటాను యాక్సెస్ చేయవచ్చు: bit.ly/3tVrAGH